Tuesday, 4 February 2014

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు

బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో విప‌రీత‌మైన ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. సింహా మూవీ త‌రువాత వ‌స్తున్న ఈ మూవీపై బాలకృష్ణ ఎక్కువ‌ న‌మ్మకాల‌ను పెట్టుకున్నాడు. ఎందుకంటే బాలకృష్ణ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌టానికి ముందు వ‌స్తున్న చిత్రంగా లెజెండ్ మూవీ తెర‌కెక్కుతుంది. అందుకే ఈ మూవీ ఎంత‌గా సూప‌ర్ స‌క్సెస్‌ను సాధిస్తుందో, ఆ విధంగా త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ కూడ గ్రాండ్ స‌క్సెస్‌ను సాధిస్తుంద‌ని బాల‌య్య భావిస్తాన్నాడంట‌. ఇదిలా ఉంటే ఈ మూవీను ఎప్పుడు రిలీజ్ చేయాలి; ఎప్పుడు ఆడియో ఫంక్షన్‌ను చేయాలి? వంటి విష‌యాల‌ను బాల‌కృష్ణ నిర్ణయించిన‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మార్చి 28న లెజెండ్ మూవీను రిలీజ్ చేసుకునే విధంగా ప్లానింగ్స్ జ‌రుగుతున్నాయి. అందుకు బాల‌కృష్ణ కూడ
గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అలాగే లెజెండ్ మూవీ ఆడియో ఫంక్షన్‌కు కూడ మార్చి 9న జ‌ర‌పాల‌ని, బాల‌య్య ముహ‌ర్తం పెట్టిన‌ట్టు చిత్ర యూనిట్ నుండి అందిన స‌మాచారం. ఈ విధంగా లెజెండ్ మూవీ ఆడియో ఫంక్షన్‌, రిలీజ్ డేట్ వివ‌రాల‌ను ప్రత్యేకంగా బాల‌కృష్ణ ద‌గ్గర వుండి ముహ‌ర్తాల‌ను పెడుతున్నాడ‌ని టాలీవుడ్ నుండి అందిన స‌మాచారం. ఈ డేట్స్‌ను బాల‌కృష్ణానే స్వయంగా అనౌన్స్ చేస్తాడ‌ని కూడ టాక్స్ వినిపిస్తున్నాయి. బాలకృష్ణ న‌టిస్తున్న లెజెండ్ మూవీ ఏ విధ‌మైన స‌క్సెస్‌ను సాధిస్తుంది? ఈ టాపిక్‌పై మీ కామెంట్స్‌ను పోస్ట్ చేయండి.